బ్రేకింగ్

breaking
09 May 2024 | 17:16 IST

రిజర్వేషన్ల రద్దు కుట్రను అడ్డుకుంటాం: రాహుల్‌

నర్సాపూర్‌: రాజ్యాంగంతోపాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని భాజపా, ఆరెస్సెస్‌ కుట్ర చేస్తున్నాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మెదక్‌ జిల్లా నర్సాపుర్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘ కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా ఆలోచన. వాటిని అడ్డుకునేందుకు ఇండియా కూటమి పోరాడుతోంది. బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. దేశంలోని పేదలందరితో జాబితా రూపొందిస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి.. బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తాం’’ అని రాహుల్‌ అన్నారు. 

మరిన్ని

తాజా వార్తలు