ఓటమి రుచి చూస్తేనే...

జీవితంలో అన్నీ విజయాలే కానక్కర్లేదు. కొన్నిసార్లు అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావొచ్చు. అలాని కుంగిపోతే జీవితమే ఉండదు.....

Updated : 08 Dec 2022 19:48 IST

జీవితంలో అన్నీ విజయాలే  కానక్కర్లేదు. కొన్నిసార్లు అడుగడుగునా అడ్డంకులు ఎదురు  కావొచ్చు. అలాని కుంగిపోతే  జీవితమే ఉండదు. మనకు మనమే స్ఫూర్తిని అందించుకోవాలి. చేసిన పొరబాట్ల నుంచి పాఠాలను నేర్చుకోవాలి.
* ఒకపని చేయాలని తలపెట్టినప్పుడే దాన్ని పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయో లేదో అంచనా వేసుకోవాలి. ఇది వాస్తవికంగా ఉండేలా తప్ప... అతిగా ఊహించుకోవడం, తక్కువ చేసుకోవడం వల్ల మీకు మీరే అన్యాయం చేసుకుంటారు. మీ బలాలు, నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరనుకున్నది సాధ్యమవుతుంది.
* కారణం ఏదైనా...ఆ వైఫల్యాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల మరింతగా నిరాశలోకి కూరుకుపోతారు. బదులుగా అలా జరగడానికి కారణాలను విశ్లేషించుకోవాలి. ప్రతికూల అంశాలను గుర్తించాలి.  వాటిని అధిగమించడానికి దగ్గర దారులను అన్వేషించాలి. ఎందుకంటే అప్పటికి మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా కొంత దూరం ప్రయాణించగలిగారు. ఆ అనుభవంతో మిగతా లక్ష్యం సులువుగా చేరుకోగలరు. ఇవన్నీ మీ భవిష్యత్తు ప్రయాణాన్ని విజయవంతం అయ్యేలా చేస్తాయి.
* గెలుపు ఓటములు ఎప్పుడూ ఒకరి సొత్తే కాదు. ఆ గెలుపుని నిలబెట్టుకోవాలంటే నిరంతరం శ్రమించాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. అవసరం అనుకుంటే మరికొన్ని అర్హతలు పెంచుకోవాలి. ఇవన్నీ మనల్ని లక్ష్యం చేరుకునేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్