తను నా సర్వస్వం
నా భార్య అంజలితో చేస్తున్న ఈ ప్రయాణాన్ని ఒక్కమాటలో ‘అత్యద్భుతం’ అనే చెబుతా. క్రికెట్ పరిభాషలో అయితే ‘ద బెస్ట్ పార్ట్‌నర్‌షిప్’ అనొచ్చు.
- సచిన్
నా భార్య అంజలితో చేస్తున్న ఈ ప్రయాణాన్ని ఒక్కమాటలో ‘అత్యద్భుతం’ అనే చెబుతా. క్రికెట్ పరిభాషలో అయితే ‘ద బెస్ట్ పార్ట్‌నర్‌షిప్’ అనొచ్చు. తొలిసారి ఎదురుపడినప్పుడు కనీస పరిచయం లేదు. కానీ రెండోసారికే స్నేహితులమయ్యాం. అది కాస్తా ప్రేమగా మారింది. ‘పెళ్లి చేసుకుందామా’ అని తనడిగితే వెంటనే ఓకే చెప్పేశా. పెళ్లికి ఇంట్లో వాళ్లని ఒప్పించిందీ తనే! అంజలి.. మెడిసిన్‌లో గోల్డ్ మెడలిస్ట్. వైద్యవృత్తి అంటే తనకెంతో ఇష్టం. మా పెళ్లైన తర్వాతా కెరియర్‌ను కొనసాగించింది. పిల్లలు సారా, అర్జున్ మా జీవితాల్లోకి వచ్చాక ఎవరో ఒకరు వాళ్లతో ఉండక తప్పదు. ‘నువ్వు దేశం కోసం ఆడుతున్నావు. కాబట్టి, మధ్యలో ఆపొద్దు, కొనసాగు’ అంది. తల్లిగా ఆలోచించి, కెరియర్‌ను పక్కన పెట్టేసింది. కుటుంబ బాధ్యతలను తీసుకుంది. తను ఆరోజు అలా చేయకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో! మా అమ్మానాన్నలనీ తనే చూసుకుంది. ఏ సమస్యలొచ్చినా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనా దగ్గరుండి చూసుకుంది. నా బెస్ట్ ఫ్రెండ్ తను. ప్రతి విషయాన్ని అంజలితో పంచుకొంటా. తనకు మొదట్లో క్రికెట్‌పై అవగాహన లేదు. నా కోసం తెలుసుకొంది. నా ఒత్తిడి, ఆందోళనలను చిటికెలో మాయం చేస్తుంది. ఎంతటి సమస్య అయినా తేలిగ్గా పరిష్కరిస్తుంది. నా ప్రతి పనిలో తన భాగస్వామ్యం తప్పనిసరి. అందుకే అంజలి గురించి చెప్పాలంటే అక్షరాలు సరిపోవు. తను నా సర్వస్వం, జీవితం కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.