Success tips: నాయకురాలవ్వాలా..

ఇల్లు, పిల్లల బాధ్యతలు అన్నీ చక్కబెట్టుకొని ఆఫీసుకెళ్తాం.. కారణం కెరియర్‌లో ఎదిగేందుకే. భర్త సంపాదిస్తున్నాడు కదా నీకెందుకు ఉద్యోగం అంటుంటారు కొందరు.

Published : 02 May 2023 00:13 IST

ఇల్లు, పిల్లల బాధ్యతలు అన్నీ చక్కబెట్టుకొని ఆఫీసుకెళ్తాం.. కారణం కెరియర్‌లో ఎదిగేందుకే. భర్త సంపాదిస్తున్నాడు కదా నీకెందుకు ఉద్యోగం అంటుంటారు కొందరు. అయినా మన కంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం. ఇంత కష్టపడే మనం టీమ్‌ లీడర్‌గా అవకాశం వస్తే మాత్రం వెనకడుగేస్తాం. కారణం భయం.. దీన్ని జయిస్తే జీవితంలో ఎదగొచ్చంటున్నారు నిపుణులు..

సానుకూలంగా.. ఆఫీసులో అందరితో సానుకూలంగా స్పందించటం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకే చిర్రు బుర్రులాడొద్దు. స్థాయీ భేదాల్లేకుండా నవ్వుతూ పలకరించడం అలవరచుకుంటే సరి. మీరేదైనా ఆపదలో ఉంటే చేయూత నందిస్తారు. సహోద్యోగులంతా చలాకీగా మాట్లాడుతుంటే టీమ్‌లీడర్‌గా చేసేందుకు భయం ఉండదు.

వల్ల కాదనకుండా.. పై అధికారి ఏ పని అప్పగించినా చేయలేమనే భయంతో ముందే నావల్ల కాదని చెప్పేస్తాం. మీ దాకా వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకోవద్దు. అది ఎంతటి పని అయినా సరే... ఇతరుల సాయంతోనైనా పూర్తి చేయాలి కానీ చేయలేననేయకండి. కష్టం అనిపించినా శ్రమపడితేనే కెరియర్‌లో స్థిరపడేందుకు మరిన్ని అవకాశాలొస్తాయి.

ఇతరులతో.. అన్నీ మనకే తెలుసనుకోవడం మంచి పద్ధతి కాదు. ఇతరుల అభిప్రాయాలకూ విలువివ్వండి. అన్ని విషయాల్లో కాకపోయినా మీకు సందేహం అనిపించిన విషయాల్లో అయినా సలహా పాటించొచ్చు. మీరు చేసిన ప్రాజెక్టు ఎలా ఉంది.. ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా అనే విషయాన్ని కూడా చర్చించొచ్చు. అప్పుడు మీపై గౌరవం కూడా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్