close
గుస‌గుస‌లు
అఖిల్‌కు జోడీగా నివేదా?

హైదరాబాద్‌: ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని వారసుడు అఖిల్‌.. త్వరలో బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించబోయే చిత్రంలో నటించనున్నారు. జులై మూడో వారంలో చిత్రీకరణ మొదలవుతుంది. అయితే ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా తమిళ భామ నివేదా పేతురాజ్‌ను ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు నివేదా. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక అఖిల్‌, నివేదాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల్‌ నటించబోయే చిత్రాన్ని అల్లు అరవింద్‌, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించనున్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.