close
హాలీవుడ్
పాప్‌ యువరాణి బ్రిట్నీ ఎందుకు అలాచేసింది?

గుండు చేయించుకున్న ఆమె చర్య వెనుక గుండెలు పిండే విషాదం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాప్‌ సంగీత ప్రపంచపు రారాణి, అమెరికన్‌ సంగీత సంచలనం బ్రిట్నీ స్పియర్స్‌ 2007 సంవత్సరంలో తన జుట్టును పూర్తిగా తీసేసి గుండు చేయించుకుంది. అతి చిన్న వయస్సులోనే ఏడు గిన్నిస్‌ రికార్డులు, ఆరు ఎమ్‌టీవీ మ్యూజిక్‌ వీడియో అవార్డులు, గ్రామీ అవార్డుతో సహా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఒక స్టార్‌ను కూడా సొంతం చేసుకున్న ఈ పాప్‌ ఐకాన్‌ చర్యకు అభిమానులతో పాటు ప్రపంచమంతా నివ్వెరపోయింది. బ్రిట్నీ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణాన్ని ఇన్నేళ్ల తరువాత ‘‘డాక్యుమెంటరీ విత్‌ బ్రిట్నీ స్పియర్స్‌: బ్రేకింగ్‌ పాయింట్‌’’ అనే డాక్యుమెంటరీ బయటపెట్టింది. అతి చిన్న వయస్సు నుంచే ప్రదర్శనలిస్తున్న బ్రిట్నీ తన జుట్టు, మేకప్‌ కోసం ఎన్నో గంటలు గడపాల్సి రావడం ఆమెను తీవ్రంగా విసిగించింది. అంతే కాకుండా తాను ఎంతో నమ్మిన అంగరక్షకులు.. అవసరమైన సమయాల్లో అండగా నిలవడం మాని, డబ్బు కోసం మీడియాను అనుమతించడం ఆమెను అమితంగా బాధించింది. తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేని బ్రిట్నీ తనకు తాను అంద వికారంగా తయారుకావాలని నిర్ణయించుకుని ఒక సెలూన్‌లో అడుగుపెట్టిందట.
ఆ రాత్రి ఏం జరిగింది?

 

ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలను స్పియర్స్‌ గుండు చేయించుకున్న సెలూన్‌ యజమానురాలు ఎస్తేర్‌ టోగ్నోజ్జీ చెప్పింది: ‘‘బ్రిట్నీ ఆ రోజు సెలూన్‌ మూసేసే సమయానికి వచ్చింది. శుభ్రం చేస్తున్న మా సిబ్బంది తెల్లని ఫ్లాష్‌లైట్లు వెలగడం గమనించారు. ఇంతలో ఎవరో ‘‘హేయ్‌, తలుపు తీయండి, బ్రిట్నీ స్పియర్స్‌ లోపలికి రావాలనుకుంటోంది.’’ అనడం వినిపించింది. ఆమె లోపలికి వచ్చి నా కుర్చీలో కూర్చుంది. నేను తనకే విధంగా సహాయం చేయగలను అని అడిగినప్పుడు, ‘‘నేను నా తల మీదనున్న జుట్టు పూర్తిగా షేవ్‌ చేసుకోవాలనుకుంటున్నాను.’’ అని ఆమె జవాబిచ్చింది.’’ బ్రిట్నీ నిర్ణయాన్ని మార్చడానికి తాను ప్రయత్నించినప్పటికీ అమె వినలేదనీ, పైగా జుట్టు తొలగించుకున్నాక ఆమె ఎంతో ఆనందంగా కనిపించిందని కూడా ఎస్తేర్‌ చెప్పుకొచ్చింది. ‘‘నా తలను ఎవరూ ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా కురులను ముట్టుకునే వాళ్లంటే నాకు అసహ్యం.’’ అని బ్రిట్నీ ఏవగించుకున్నట్లు టాటూ ఆర్టిస్ట్‌ ఎమిలీ వైన్‌ హగ్స్‌ చెప్పింది.
మానసికంగా ఇంత నరకం అనుభవించినా.. బ్రిట్నీ ఇంత దృఢంగా ఉండటానికి కారణం ఆమె తండ్రి జేమ్స్‌ స్పియర్స్‌ అట. జీవితంలోనే అత్యంత దుర్భర స్థితిని అనుభవిస్తున్నపుడు ఆమె తండ్రి కలుగజేసుకుని ఆదుకోకపోయి ఉంటే పరిస్థితులు మరోవిధంగా ఉండేవని ఆమె సన్నిహితులు చెప్పారు. ఇంత సంఘర్షణ నుంచి తండ్రి చేయూతతో బయటపడిన బ్రిట్నీ స్పియర్స్‌ ఇటీవల విడుదలైన ‘కార్పొరేట్‌ యానిమల్స్‌’ అనే అమెరికన్‌ కామెడీ హారర్‌ చిత్రంలో తన ఆత్మగా తానే నటించి.. నవ్వులు పంచింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.