పుట్టబోయే పాపాయి కోసం..

పిల్లలు మన జీవితాల్లో నింపే సంతోషాలు ఎన్నో. వారి బుజ్జి బుజ్జి మాటలతో, చేతలతో ఇంటి వాతావరణమే మారిపోతుంది. అదలా సంతోషంగా కొనసాగాలంటే కొన్ని ప్రణాళికలు అవసరం.

Published : 26 Mar 2023 00:25 IST

పిల్లలు మన జీవితాల్లో నింపే సంతోషాలు ఎన్నో. వారి బుజ్జి బుజ్జి మాటలతో, చేతలతో ఇంటి వాతావరణమే మారిపోతుంది. అదలా సంతోషంగా కొనసాగాలంటే కొన్ని ప్రణాళికలు అవసరం. వాటిలో ముఖ్యమైనది ఆర్థిక ప్రణాళికే. దానికోసం నిపుణుల సూచనలివీ!

పుట్టకముందే.. ప్రెగ్నెన్సీ , డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా ఖర్చు అంచనా వేసుకొని పొదుపు చేసుకుంటే మంచిది.

అత్యవసర నిధి.. మనకు ఏ సమయంలో డబ్బు అవసరం అవుతుందో ముందే ఊహించలేం. కొన్నిసార్లు అనుకోకుండా డబ్బు ఎక్కువ ఖర్చవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేలా కొంత పక్కన ఉంచుకోవాలి. దాన్ని ఇతర అవసరాల కోసం వాడకూడదు. అత్యవసర సందర్భాల్లో ఈ నిధి పనికొస్తుంది.

ఆలోచించి కొంటేనే.. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్కువ ఖరీదు పెట్టి దుస్తులు కొనాల్సిన అవసరం లేదు. తప్పనిసరైనవి మాత్రమే కొంటే సరిపోతుంది. ధరలు తక్కువగా ఉన్న సమయం లేదా పుట్టిన రోజు, పండగల సందర్భాల్లో కొనుగోలు చేస్తే తక్కువ రేట్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో పిల్లలకు సంబంధించిన ఎన్నో రకాల ఉత్పత్తులు కనిపిస్తుంటాయి. ఇరుగు పొరుగు వాళ్లతో పోల్చుకొని చూసినవన్నీ కొనటం మంచిది కాదు. అలా చేస్తే కొన్ని రోజులకు అవన్నీ కుప్పగా తయారవుతాయి. భద్రపరచడానికి స్థల సమస్య, పారేయడానికి మనసొప్పదు. కాబట్టి, ఏది అవసరమో.. ఏది కాదో ముందే ఆలోచించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్