ఇకనుంచైనా మారాలని!
అక్కడ అమ్మాయిల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడతారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ చూస్తే వెయ్యిమంది ఆడపిల్లల ఆచూకీ తెలియలేదు.
అక్కడ అమ్మాయిల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడతారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ చూస్తే వెయ్యిమంది ఆడపిల్లల ఆచూకీ తెలియలేదు.
అందుకే టీనేజీలో అడుగుపెట్టగానే ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు అక్కడివాళ్లు. నైజీరియాలోని కానో పట్టణ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఇలానే ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చింది కబారా అనే స్వచ్ఛంద సంస్థ. ఆడపిల్లలకు రోబోటిక్స్, కంప్యూటింగ్, సైన్సు, లెక్కల్లో ప్రత్యేకంగా తర్ఫీదునిస్తోంది. ‘ఇలా శిక్షణ ఇవ్వడం వల్ల అమ్మాయిలు ఉపాధి సాధిస్తారనీ, పెళ్లిచేసుకున్నా వాళ్ల కుటుంబాలని చక్కగా మేనేజ్చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సంస్థను స్థాపించా’ అంటున్నారు హదీజా అనే ఇంజినీర్. కానోలో అమ్మాయిలు కిడ్నాప్‌లకు గురికావడానికి వీలుకాని అత్యంత సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకుని కబారాని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ మూడువందలమంది ఆడపిల్లలకు మాత్రమే ఈ శిక్షణ అందినా తర్వాతి తరాల ఆడపిల్లల్లో ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెబుతున్నారు నిర్వాహకులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
ఆరోగ్యమస్తు
- ‘కీరా దోస’తో.. కోరినంత ఆరోగ్యం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- వేడికి... సహజ మంత్రం!
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
అనుబంధం
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
యూత్ కార్నర్
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
- సైన్స్లోకంలో విహరిద్దాం రండి!
- ఆకాశం నుంచి... ఓటు అవగాహన!
- ఆ గౌను కోసం... పదివేల గంటలు!
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
'స్వీట్' హోం
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
వర్క్ & లైఫ్
- అది అతి అయ్యిందేమో!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!
- పెదవి కొరుకుతున్నారా..!
- ఓటు కోసం... వేల మైళ్లు
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!