Published : 16/07/2021 01:41 IST

ఆకతాయిలను పట్టే స్టాంపు

రైళ్లు, బస్సుల్లో రద్దీగా ఉన్న సమయాల్లో అమ్మాయిలు కనిపిస్తే చాలు.. అల్లరిపెట్టే ఆకతాయిల సంఖ్య తక్కువేం కాదు. ఇటువంటివారి ఆట కట్టించడానికే ఈ యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌. లైంగిక వేధింపులకు పాల్పడేవారిని గుంపులో ఉన్నా దీని సాయంతో గుర్తించొచ్చు. జపాన్‌లో తొలిసారిగా బాధితుల కోసం ఈ పరికరాన్ని విడుదల చేస్తే, అరగంటలోపే మొత్తం 500 పరికరాలు అమ్ముడుపోవడం విశేషం.

టోకియో మెట్రోపాలిటన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2017లో వచ్చిన ఫిర్యాదులను చూస్తే, వాటిలో 1,750 కేసులు రైళ్లలో రద్దీగా ఉన్నప్పుడు మహిళలు లైంగిక వేధింపులకు గురైనవే. వీటిలో 50 శాతం రైళ్లలో కాగా, 20 శాతం రైల్వేస్టేషన్లలో మహిళలపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. దీన్ని అరికట్టే దిశగా ఆ దేశానికి చెందిన సచిహతా ఇంక్‌ అనే స్టాంపుల తయారీ సంస్థ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇదే యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌. పోర్టబుల్‌ ఈవీ స్టాంపుగా పిలిచే ఈ పరికరాలు చేతిలో ఇమిడిపోయే చిన్న లిప్‌స్టిక్‌ పరిమాణంలో ఉంటాయి. దీన్ని బ్యాగు లేదా జేబులకూ ఎటాచ్‌ చేసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా పక్కన కూర్చుని లేదా నిలబడి వేధింపులకు గురి చేస్తుంటే వారికి తెలియకుండానే ఆ చేతిపై బాధితురాలు ఈ పరికరానికి ఉన్న మూతతో సున్నితంగా టచ్‌ చేస్తే చాలు. కంటికి కనిపించని ఇంక్‌ ఆ మూతద్వారా అగంతకుడి చేతిపై ముద్రగా పడుతుంది. అరగంట తర్వాత అది ఫ్లోరోసెంట్‌ వెలుతురులో మాత్రమే కంటికి కనిపిస్తుంది. ఈ లోపు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారాన్నిస్తే చాలు. ఆ గుర్తుతోనే వాడు ఊచలు లెక్క పెట్టాల్సిందే. సచిహతా ఇంక్‌ సంస్థ ప్రయోగాత్మకంగా మొదటిసారి 500 డివైస్‌లను డిజైన్‌ చేసింది. ‘యాంటీ న్యూసెన్స్‌ స్టాంపు’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసిన అరగంటలోపే మొత్తం సేల్‌ అయిపోయాయి. అంతేకాకుండా జపాన్‌లో ఓసారి ఇద్దరు విద్యార్థినులు రైల్వేస్టేషన్‌లో తమపై వేధింపులకు గురిచేసిన వారిని వెంబడించిన వీడియో వైరల్‌ అయ్యింది. తమ వద్ద ఉన్న యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌తో వారి చేతిపై ముద్రవేయడానికి వాళ్లు ప్రయత్నించడం ఆ వీడియోలో ఉంటుంది. ఈ సంఘటనతో ఆ సంస్థ తిరిగి ఈ డివైస్‌ల తయారీని పెంచడం విశేషం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి