వీగన్‌కి ఆమె లోగో

వీగన్‌ ఉత్పత్తులంటే తెలుసుగా! వాటిల్లో జంతు సంబంధ పదార్థాలేమీ ఉపయోగించరు. ఈ ఆహార పదార్థాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇటీవల లోగో విడుదల చేసింది. దాన్ని రూపొందించింది ఓ అమ్మాయి!

Updated : 01 Oct 2021 05:13 IST

వీగన్‌ ఉత్పత్తులంటే తెలుసుగా! వాటిల్లో జంతు సంబంధ పదార్థాలేమీ ఉపయోగించరు. ఈ ఆహార పదార్థాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇటీవల లోగో విడుదల చేసింది. దాన్ని రూపొందించింది ఓ అమ్మాయి!

కృతి మనీష్‌ రాథోడ్‌కు దీన్ని రూపొందించడానికి 20 నిమిషాలే పట్టిందట. బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో ఎంఎస్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీగనిజమ్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంబంధిత ఆహార ఉత్పత్తులకు లోగో కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కృతి చదువుతున్న కాలేజ్‌ ప్రొఫెసర్‌ తరగతిలో చెప్పి అందరినీ ప్రయత్నించమన్నారు. అది  గుర్తులానే కాకుండా దాని ప్రాముఖ్యత తెలిసేలా ఉండాలనుకుంది కృతి. అందుకోసం పరిశోధన చేశాక రూపకల్పన ప్రారంభించింది. తన ఆలోచనను వాళ్ల నాన్నతో పంచుకోగా ఆయన కొన్ని సలహాలిచ్చారు. వాటి సాయంతో వీగన్‌ను ప్రతిబింబించేలా ‘వి’ అక్షరాన్ని, మధ్యలో ఈ ఆహారం మొక్కల నుంచి వచ్చిందన్న దానికి గుర్తుగా పచ్చని మొక్కనీ ఉంచింది. తమకు వచ్చిన ప్రతిపాదనల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కృతి డ్రాయింగ్‌ను మెచ్చి దీన్నే అధికారిక లోగోగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్