మహిళా కోణాన్ని చూపిద్దామనే!
భారతీయ వ్యాపార ప్రకటనల్లో ఎక్కువ భాగం మహిళా వినియోగదారులను ఉద్దేశించినవే. కానీ, స్త్రీవాదం, స్త్రీత్వం, మహిళా కోణం వంటివి వాటిల్లో పెద్దగా కనిపించవు.
భారతీయ వ్యాపార ప్రకటనల్లో ఎక్కువ భాగం మహిళా వినియోగదారులను ఉద్దేశించినవే. కానీ, స్త్రీవాదం, స్త్రీత్వం, మహిళా కోణం వంటివి వాటిల్లో పెద్దగా కనిపించవు. దీన్ని అధిగమించడానికే రీడిఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్ సంస్థ ఆల్ విమెన్ యాడ్ ఏజెన్సీని ప్రారంభించింది. దీని పేరు ‘లేడీ ఫింగర్’. ఈ సంస్థకు సీఈవోగా తిస్తాసేన్, ఛైర్‌పర్సన్ తాన్యా గోయల్‌తో పాటు... డిజైనింగ్, మార్కెటింగ్ బృందమంతా ఆడవాళ్లే. 2019లో కాంతర్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో 58శాతం యాడ్‌లు ప్రత్యేకంగా మహిళలే లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చాయి. వీటిల్లో కేవలం 35 శాతం మాత్రమే స్త్రీ, పురుషులిద్దరికీ సంబంధించినవట. ఈ నివేదిక ప్రకారం... చాలా ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లకు మహిళలే ప్రాథమిక కొనుగోలుదారులు. బ్యాంకింగ్ రంగం నుంచి బ్యూటీ పరిశ్రమ వరకూ ...అన్ని ప్రచారాల్లోనూ అతివల ప్రాతినిథ్యం ఎక్కువే. అయినా సరే, వాటి రూపకల్పనలో లింగ సమానత్వాన్ని మాత్రం సాధించలేక పోయారనీ, ఆ సమతుల్యత సాధించగలిగినప్పుడే బ్రాండ్ విలువ పెరుగుతుందనీ ఇది వెల్లడిస్తోంది. అయితే, మనదేశంలోని ప్రతి మూడు బ్రాండ్లలో ఒకటి మాత్రమే ఈ బ్యాలెన్స్‌ను సాధిస్తోందనీ అంటోంది. అందుకే, ఈ పరిస్థితిని అధిగమించి మార్కెట్లో మగువల ప్రాధాన్యాన్ని పెంచడం, ప్రకటనల్లో స్త్రీ కోణాల్ని స్పృశించడంతో వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త ఒరవడి సృష్టించడమే తమ లక్ష్యమనీ’ తిస్తాఖాన్ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.