close
అవీ.. ఇవీ..
అందులో చిన్న పాత్రేచేశా: యోగిబాబు

 యోగిబాబు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘బట్లర్‌ బాలు’ చిత్రంలో చిన్న హాస్యపాత్ర మాత్రమే పోషించానని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. ఎస్పీ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్లర్‌ బాలు’. ఇందులో యోగిబాబు హీరోగా నటిస్తున్నారని, ఆయనకు సంబంధించిన డైలాగులను ఎస్పీ రాజ్‌కుమార్‌ రాశారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని యోగిబాబు ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ధర్మప్రభు, గుర్కా చిత్రాల్లో నేను కథానాయకుడిగా నటించా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్యనటుడి పాత్రలు పోషిస్తున్నాను. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ‘బట్లర్‌ బాలు’ అనే చిత్రంలో నటించా. నాలుగు రోజులు మాత్రమే ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నా. కానీ నేనే ఆ సినిమా హీరో అన్నట్లు ఆ చిత్రవర్గాలు ప్రకటిస్తున్నాయి. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను చిన్న పాత్ర మాత్రమే పోషించా. అంతేకాకుండా నాకు ఆ సినిమాలో ఎవరూ డైలాగులు రాసివ్వలేదు. డైరెక్టర్‌ చెప్పిన మాటలకు నాస్టైల్‌లో డైలాగులు రాసుకున్నా. ఇంకా పలు హాస్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నదే నా లక్ష్యం. నన్ను ఆధరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’నని పేర్కొన్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.