close
బాలీవుడ్
‘పృథ్వీరాజ్‌’గా అక్షయ్‌

ఏడాది ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రాలతో  విజయాలందుకున్నారు అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘పృథ్వీరాజ్‌’ పేరుతో తెరకెక్కే చిత్రంలో నటించనున్నారు. సోమవారం అక్షయ్‌ 52వ పుట్టినరోజు  సందర్భంగా ఈ సినిమా టైటిల్‌  టీజర్‌ను విడుదల చేశారు. భారతదేశంపై దండెత్తి వచ్చిన ఇస్లాం ఆక్రమణదారులను ఎదుర్కొన్న వీరుడిగా చరిత్రకెక్కిన రాజ్‌పుత్‌ మహారాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితకథతో ఈ చిత్రం రూపొందుతోంది. యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించనుంది. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకుడు. అక్షయ్‌ వచ్చే ఏడాదిలో ఈద్‌కు ‘లక్ష్మీబాంబ్‌’, దీపావళికి ‘పృథ్వీరాజ్’, క్రిస్మస్‌కు ‘బచ్చన్‌ పాండే’ చిత్రాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.