బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 17:10 IST

పవన్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్‌ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ బరిలోకి దిగుతున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభం కానుంది.  వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.

మరిన్ని

తాజా వార్తలు