బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 15:48 IST

Stocks: 7 రోజుల నష్టాలకు బ్రేక్‌.. సెన్సెక్స్‌ 1016+

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం రోజున భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో సూచీలు పుంజుకున్నాయి. దీంతో ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడినట్లైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1016.96 పాయింట్లు లాభపడి 57,426.92 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 276.25 పాయింట్ల లాభంతో 17,094 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.32గా ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌, ఏటీసీ, ఏషియన్‌ పేయింట్స్‌ షేర్లు నష్టపోగా.. విప్రో, టీసీఎస్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని

తాజా వార్తలు