బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 17:40 IST

ఏం జరిగినా మాకే మేలు..భవిష్యత్‌ భారాసదే: కేసీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘ గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మా ప్రభుత్వాన్ని కూల్చేందుకే భాజపా ప్రయత్నించింది.. 64 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను వదులుతుందా? లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది. ఏం జరిగినా మాకే మేలు. రాష్ట్రంలో భవిష్యత్‌ భారాసదే’’ అని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు