బ్రేకింగ్

breaking
17 Jan 2022 | 14:40 IST

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్‌ తేదీ మార్పు

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల పోలింగ్‌ తేదీని ఈసీ మార్పు చేసింది. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉండగా, దానిని 20కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గురు రవిదాస్‌ జయంతి వేడుకలు ఉన్నందున ఈ తేదీ మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి ఉండగా, ఉత్సవాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు యూపీలోని వారణాసికి వెళ్తారని.. దీంతో ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి తెలిపాయి. 

మరిన్ని

తాజా వార్తలు