108ఎంపీ కెమెరా... 5జీ ఫీచర్‌తో ‘ఎంఐ 10ఐ’
close

108ఎంపీ కెమెరా... 5జీ ఫీచర్‌తో ‘ఎంఐ 10ఐ’

1/25

దేశంలోకి 5జీ మొబైల్స్‌ జోరందుకుంటోంది. కొత్త సాంకేతికతతో మొబైల్స్‌ తీసుకురావడానికి సంస్థలు వరుసకడుతున్నాయి. తాజాగా షావోమి సరికొత్త ‘ఎంఐ10ఐ’ని భారతీయ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్స్‌తో ₹25 వేలలోపు ధరలో మూడు వేరియంట్లలో మొబైల్స్‌ను లాంచ్‌ చేశారు.

2/25

108 ఎంపీ కెమెరా, 5జీ నెట్‌వర్క్‌ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిన ఈ మొబైల్‌లో ఇంకా ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే....

3/25

భారతీయుల కోసం... భారతీయుల చేత అంటూ... ఎంఐ10ఐ మొబైల్‌ను షావోమి మన దేశంలో లాంచ్‌ చేసింది.

4/25

మొబైల్‌ ఉష్ణోగత్రను స్థిరం ఉంచడానికి కూలింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. దీని కోసం మొబైల్‌లో 11 టెంపరేచర్‌ సెన్సర్స్ ఉంటాయి.

5/25

120 హెడ్జ్‌ అడాప్టివ్‌ సింక్‌ డిస్‌ప్లే ఉంటుంది.

6/25

స్క్రీన్‌ రిజల్యూషన్‌ వినియోగం బట్టి మారుతూ ఉంటుంది. సినిమాలు చూసినప్పుడు ఒకలా, గేమ్స్‌ ఆడినప్పుడు మరోలా ఉంటుంది.

7/25

ఉత్తమ స్క్రీన్‌ రిజల్యూషన్‌ కోసం హెచ్‌డీఆర్‌ 10 సాంకేతికత వినియోగిస్తున్నారు.

8/25

గేమింగ్‌ అనుభూతి మెరుగ్గా ఉండటానికి స్క్రీన్‌కు 240 హెడ్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ఇస్తున్నారు.

9/25

ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే మరింత ఎంజాయ్‌ చేసేలా ఫ్రంట్‌ కెమెరా చాలా చిన్న హోల్‌ ఇచ్చారు.

10/25

మెరుగైన శబ్దం కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ ఇస్తున్నారు.అలాగే ఇందులో 3.5 ఎంఎం హెడ్‌ ఫోన్‌ జాక్‌ కూడా ఉంటుంది.

11/25

ఐపీ 53 రేటింగ్‌ స్ప్లాష్‌ ప్రూఫ్‌ సౌకర్యం ఉంది.

12/25

ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఇస్తున్నారు.

13/25

మొబైల్‌ ముందు, వెనుకవైపు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5తో ప్రొటెక్ట్‌ చేస్తున్నారు.

14/25

వెనుకవైపు కెమెరా సెటప్‌కు 360 డిగ్రీల ఆంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌ ఫీచర్‌ను జోడించారు.

15/25

ఇన్నాళ్లూ వెనుకవైపు కెమెరాలో ఉన్న టైమ్‌లాప్స్‌ ఫీచర్‌ను ఫ్రంట్‌ కెమెరాకు కూడా తీసుకొచ్చారు. ఇందులో కొత్తగా టైమ్‌లాప్స్‌ సెల్ఫీ సౌకర్యం ఉంటుంది.

16/25

లాంగ్‌ ఎక్స్‌పోజర్‌ మోడ్‌ ఫీచర్‌తో ఉత్తమమైన ఫొటోలు తీయొచ్చని షావోమి చెబుతోంది.

17/25

ఈ మొబైల్‌ కెమెరాలో ఫొటో, వీడియో క్లోన్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు.

18/25

ఉత్తమ ఆన్‌ డివైజ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం లీనియర్‌ మోటార్‌ను వినియోగిస్తున్నారు.

19/25

4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

20/25

ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది.

21/25

వెనుకవైపు 8ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌తోపాటు మాక్రో, డెప్త్‌ సెన్సర్లు కూడా ఉంటాయి.

22/25

వెనుకవైపు ప్రధానంగా 108 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 9 ఇన్‌ 1 పిక్సల్‌ బిన్నింగ్‌ సాంకేతికత ఉండటం వల్ల ఫొటో క్వాలిటీ బాగుంటుంది.

23/25

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జి 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

24/25

అత్యుత్తమ నాణ్యతో వీడియోలు వీక్షించడానికి వైడ్‌వైన్‌ ఎల్‌1 సర్టిఫికేషన్‌ ఉంటుంది.

25/25

ఈ నెల 8 నుంచి అమెజాన్‌, ఎంఐ.కామ్‌లో సేల్స్‌ మొదలవుతాయి. ప్రైమ్‌ వినియోగదారులకు ఏడో తేదీనే అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న