
1/9

తక్కువ బడ్జెట్ ఫోన్లను వినియోగదారులకు అందించేందుకు మోటోరోలా ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలో మోటో E7 పవర్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రూ.7వేల నుంచి రూ.9 వేల లోపు మంచి ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 26 నుంచి ఆన్లైన్ వేదికగా అమ్మకాలను ప్రారంభించబోతోంది. 2 జీబీ+32 జీబీ, 4జీబీ+64 జీబీ వేరియంట్లలో లభించనుంది.
2/9

స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా పనిచేయాలంటే ప్రాసెసర్ అత్యంత కీలకం. మోటో E7 పవర్ మొబైల్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్‌ను వినియోగించడం జరిగింది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పని చేస్తుంది.
3/9

స్మార్ట్ఫోన్లు వచ్చాక గేమింగ్ యాప్‌ల వినియోగం పెరిగిపోయింది. చక్కగా స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు. మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది.
4/9

4జీబీ ర్యామ్‌తో.. ఇంటర్నెట్ స్టోరేజీ 64 జీబీ ఇవ్వగా.. స్టోరేజీ కెపాసిటీని ఒక టెరా బైట్ వరకు పెంచుకునే వీలు కల్పించింది.
5/9

మోటో E7 పవర్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఎరుపు, నీలం రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
6/9

స్మార్ట్‌ఫోన్ అనగానే ముందుగా కెమెరా పనితనం గురించి ఆరా తీస్తుంటారు. మంచి క్లారిటీతో ఫొటోలను తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. అలాంటివారి కోసం 13 ఎంపీ+2 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను మోటో ఇచ్చింది.
7/9

స్మార్ట్ఫోన్లకు బ్యాటరీ లైఫ్ ఎంతో ముఖ్యమైన విషయం. యూజర్లకు ఛార్జింగ్ సమస్య తలెత్తకుండా పవర్ఫుల్ బ్యాటరీని అందించినట్లు మోటో తెలిపింది. 5000 mAh బ్యాటరీతో టైప్-c ఛార్జర్‌ను సంస్థ అందించింది.
8/9

ఫోన్ డిస్ప్లే సైజ్ కొంతమందికి ఎక్కువగా ఉంటే నచ్చుతుంది. మరికొందరు తక్కువగా ఉండే స్క్రీన్లను ఇష్టపడతారు. అయితే మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే సైజ్ 16.54 సెం.మీ (6.51 అంగుళాలు)తో హెచ్డీ+ రిసొల్యూషన్తో ఉంది.
9/9
