గెలాక్సీ ‘A’ సిరీస్‌లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్‌..ఫీచర్లివే!
close

గెలాక్సీ ‘A’ సిరీస్‌లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్‌..ఫీచర్లివే!

1/11

శాంసంగ్ కంపెనీ మరో కొత్త 5జీ మొబైల్‌ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ52ఎస్‌ 5జీ పేరుతో ఈ ఫోన్‌ని పరిచయం చేసింది. ప్రీమియం ఫోన్‌ శ్రేణిలో యువతకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా గెలాక్సీ ఏ52ఎస్‌ను తీసుకొచ్చినట్లు శాంసంగ్ తెలిపింది. మరి ఈ ఫోన్ ధరెంత? ఎలాంటి ఫీచర్లున్నాయి? వంటి వివరాల గురించి తెలుసుకుందాం.

2/11

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3 ఓస్‌తో పనిచేస్తుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 778జీ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 12 రకాల 5జీ బ్యాండ్‌విడ్త్‌లను సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఇస్తున్నారు.

3/11

120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే ఇస్తున్నారు.

4/11

ఐపీ67 ప్రొటెక్షన్‌ ఉంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ ఉంటుంది. అంటే ఫోన్‌ నీటిలో 30 నిమిషాలు తడిచినా పాడవదని శాంసంగ్‌ తెలిపింది.

5/11

ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, రెండు 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

6/11

ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

7/11

ఈ ఫోన్‌లోని 120Hz రిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయని శాంసంగ్ వెల్లడించింది.

8/11

ఇందులో నాక్స్ (Knox) సెక్యూరిటీ ఫీచర్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్‌ చేసిన రోజు నుంచి ఇందులోని మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫీచర్ మాల్‌వేర్‌ల నుంచి ముఖ్యమైన సమాచారానికి రక్షణ కల్పిస్తుందని శాంసంగ్ వెల్లడించింది.

9/11

గెలాక్సీ ఏ52ఎస్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

10/11

6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 35,999. 8 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 37,499.

11/11

నేటి నుంచి (సెప్టెంబరు 1) అమెజాన్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్‌లతోపాటు అన్ని రిటైల్‌ అవుట్‌లెట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. లైట్‌ వైలెట్‌, బ్లాక్‌, వైట్ రంగుల్లో లభిస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న