Realme Pad: అల్ట్రాస్లిమ్‌ డిజైన్‌తో రియల్‌మీ తొలి ట్యాబ్‌..వివరాలివే
close

Realme Pad: అల్ట్రాస్లిమ్‌ డిజైన్‌తో రియల్‌మీ తొలి ట్యాబ్‌..వివరాలివే

1/12

రియల్‌మీ కంపెనీ తన తొలి ట్యాబ్‌ రియల్‌మీ పాడ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు, సమావేశాల కోసం ఎక్కువ మంది ట్యాబ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్‌మీ పాడ్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో తీసుకొచ్చింది. మరి ఇందుతో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయో చూద్దాం.

2/12

ఇందులో రెండు కెమెరాలున్నాయి. వెనుక, ముందు 8 ఎంపీ హెచ్‌డీ కెమెరాలున్నాయి. వీటిలో 105 డిగ్రీ వైడ్ యాంగిల్‌ ఫీచర్‌ కూడా ఉంది.

3/12

4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

4/12

ఈ పాడ్‌లో మల్టీ విండో మోడ్ ఇస్తున్నారు. అంటే ఒకేసారి ట్యాబ్‌లో రెండు వేర్వేరు యాప్‌లను ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు.

5/12

ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు వీలుగా ఇందులో నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో రెండు మైకులు ఇస్తున్నారు. అలానే ఫేస్‌ రికగ్నిషన్ పీచర్‌ కూడా ఉంది. డాల్బీఅట్‌మోస్‌, హై-రిసొల్యూషన్ టెక్నాలజీతో స్పీకర్స్ అమర్చారు.

6/12

మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమ్స్ ఆడేప్పుడు ఈ ప్రాసెసర్‌ మెరుగైన అనుభూతిని యూజర్‌కి అందిస్తుంది. 4జీబీ ర్యామ్‌ ఇస్తున్నారు.

7/12

ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.

8/12

రియల్‌మీ పాడ్‌లో 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ క్విక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే ఓటీజీ కేబుల్ సాయంతో రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

9/12

రియల్‌మీ పాడ్‌లో 10.4 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులోని డిస్‌ప్లే టెక్నాలజీ నైట్‌ మోడ్‌లో బ్రైట్‌నెస్‌ని 2 యూనిట్లు తగ్గించుకుంటుంది. దానివల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని రియల్‌మీ తెలిపింది.

10/12

రియల్‌మీ పాడ్ కేవలం 6.9 ఎంఎం మందంతో 440 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

11/12

ఈ ట్యాబ్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వైఫై వేరియంట్‌ ధర రూ. 13,999. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ 4జీ+వైఫై వేరియంట్‌ ధర రూ. 15,999. 4 జీబీ/64 జీబీ వైఫై+4జీ వేరియంట్‌ ధర రూ. 17,999.

12/12

రియల్ గోల్డ్‌, రియల్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. వైఫై+4జీ వేరియంట్ల అమ్మకాలు సెప్టెంబరు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రారంభంకానున్నాయి. వైఫై వేరియంట్‌ అమ్మకాల గురించి రియల్‌మీ స్పష్టమైన ప్రకటన చేయలేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న