Updated : 23/10/2021 05:42 IST

ప్రసవం తర్వాతే ఇలా..

నా వయసు 28. ప్రసవం తర్వాత జుట్టు బాగా ఊడుతోంది. అంతకుముందు ఈ సమస్య లేదు. ఏం చేయాలి?

- ఓ సోదరి

రన్‌, హిమోగ్లోబిన్‌ శాతం తగ్గినా, హార్మోనుల్లో హెచ్చుతగ్గులు, థైరాయిడ్‌ సమస్య ఉన్నా జుట్టు ఊడుతుంది. ఓసారి సంబంధిత పరీక్షలతోపాటు విటమిన్‌ డి, ఐరన్‌, జింక్‌లనూ చెక్‌ చేయించుకుంటే మేలు. వీటిలో లోపాలుంటే సరిచేసుకోవాలి. లేదంటే విటమిన్లు, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌ సమపాళ్లలో ఉండేలా డైట్‌ ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడు జుట్టు బాగుంటుంది. హెయిర్‌ స్ట్రయిటెనింగ్‌, డై వంటి వాటికి దూరంగా ఉండాలి. సహజ నూనెలనే వాడాలి. చేపలు, గుడ్డు, ఆకు కూరలు, నట్స్‌, కూరగాయలకు ఆహారంలో ప్రాధాన్యమివ్వాలి. ఎక్సర్‌సైజ్‌ కారణంగా ఆక్సిజన్‌ శరీరంలోని అన్ని కణాలకు చేరుతుంది. అది మాడుకూ చేరుతుంది. కాబట్టి వారానికి కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేసేలా చూసుకోవాలి.

పర్యావరణం, ట్రామా, సర్జరీ, రక్తక్షీణత, హార్మోన్లలో మార్పు, ఆ సమయంలో వాడిన మందులు ఇవన్నీ కూడా జుట్టు ఊడటానికి  కారణమవుతాయి. ఐరన్‌, విటమిన్లు బి6, బి12లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్