Updated : 13/04/2022 05:41 IST

సిగ తరిగిపోతుంటే!

జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్‌ వేడుకల్లో విల్‌స్మిత్‌ భార్య జాడా పింకెట్‌ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్‌ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట వెతుకుతున్న వారి సంఖ్య కోట్లకు చేరిందట. ఇంతకీ ఏమిటిది? దీన్నెలా అధిగమించాలి?

లోపేసియా ఏరియేటా.. ఓ ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. మన స్వయం ప్రతిరక్షక కణాలు మనపైనే దాడి చేయడమన్న మాట. తెల్ల రక్తకణాలు కుదుళ్లపై దాడిచేసి, కుంగిపోయేలా చేస్తాయి. దీంతో కేశాల ఉత్పత్తి నెమ్మదించి కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా ఇది ఎక్కువగా 30 ఏళ్లలోపు వాళ్లలోనే కనిపిస్తుంది. ఆపై వారిలో అరుదు. చాలావరకూ వంశపారంపర్యమే. కొందరిలో ఒత్తిడి వల్ల ప్రేరేపితమవుతుంది. ఆస్తమా, డౌన్‌సిండ్రోమ్‌, సీజనల్‌ అలర్జీలు, థైరాయిడ్‌, విటిలిగో ఉన్న కొందరిలోనూ కనిపిస్తుంది. కొందరికి గుండ్రంగా నాణెం పరిమాణంలో ఊడితే మరికొందరిలో తలంతా కురులు రాలిపోతాయి. కొన్నిసార్లు శరీరమంతటా కనిపిస్తుంటుంది.


పెళ్లికాదని భయపెట్టారు...

హ తెలిసినప్పట్నుంచి నా జుట్టు పలుచనే. స్కూల్‌కీ విగ్గు పెట్టుకుని వెళ్లేదాన్ని. దాంతో అవమానాలూ ఎదుర్కొన్నా. టీనేజ్‌లోకి అడుగుపెట్టాక అలొపేసియా బాధితుల గ్రూప్‌లో చేరా. కొందరి అనుభవాలు విన్నాక నా ఆలోచనలో మార్పొచ్చింది. నేనెలా ఉంటానో అందరికీ అలానే కనిపిస్తానని ఇంట్లో చెప్పా. ‘ఎవరు పెళ్లి చేసుకుంటార’ని బామ్మ, అమ్మ అభ్యంతరం చెప్పారు. ఓరోజు బంధువుల్నీ, స్నేహితుల్నీ పిలిచి అందరి ముందూ గుండు చేయించుకున్నా. తర్వాత నా గురించి సోషల్‌ మీడియాలోనూ పంచుకోడం మొదలెట్టా. ‘జుట్టు లేకపోయినా సంతోషంగా, అందంగా ఉంది. అలా నేనెందుకు ఉండకూడద’నే ఆలోచనని కొందరిలోనైనా తేవాలన్నది నా ఉద్దేశం. ఆ విషయంలో విజయవంతమయ్యా. పెళ్లికి దీన్ని అడ్డుగా భావించేవాళ్లతో జీవితం ఎలా పంచుకోగలననిపించిందే తప్ప బాధపడలేదు. తర్వాత నన్ను నన్నుగా మెచ్చిన వ్యక్తి వచ్చాడు. టెక్సాస్‌లో ఉంటూ కార్పొరేట్‌ కెరియర్‌నీ కొనసాగిస్తూనే, మోడల్‌గానూ రాణిస్తున్నా.

- నీహర్‌ సచ్‌దేవ్‌


రకాలు..

అలోపేసియా ఏరియేటా టోటాలిస్‌.. తల మీద కురులన్నీ రాలిపోయి.. గుండులా మారిపోతుంది.

అలోపేసియా ఏరియేటా యూనివర్సాలిస్‌.. కనుబొమ్మలు, రెప్పలు సహా శరీరమ్మీద ఎక్కడా వెంట్రుకలుండవు.

ఓఫియాసిస్‌ అలోపేసియా.. గుండ్రంగా తల పక్కలా, వెనుక ప్యాచ్‌లుగా ఊడిపోతుంది.

డిఫ్యూజ్‌ అలోపేసియా.. ఒక్కసారిగా వెంట్రుకలు పలచబడిపోతాయి.

కొందరిలో దీని ప్రభావం మొదట గోళ్లపై చూపిస్తుంది. సూదితో గుచ్చినట్లుగా, ఇంకొన్నిసార్లు తెల్లని మచ్చలు, గీతలు కనిపిస్తాయి. గోళ్లు పల్చబడటం, మెరుపును కోల్పోయి నిర్జీవంగా, పొరలు పొరలుగా ఊడటం.. కనిపిస్తాయి. జుట్టు ఊడే ముందు విపరీతమైన దురద, మంట వంటివీ ఉంటాయి.


ఇరవై ఏళ్లకుపైగా పోరాటం..! నాకు పదేళ్లప్పుడు ఈ సమస్య మొదలైంది. ఎన్నో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేదు. చివరికి అలోపేసియాగా తేలింది. తల మీద ప్యాచ్‌లతో బయటకు వెళ్లాలంటేనే సిగ్గేసేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లతో పరిస్థితి మెరుగుపడింది. స్కూల్లో అందరూ నవ్వుతుంటే వాళ్లతో కలిసి నేనూ నవ్వేదాన్ని. అలాగైనా కొన్నాళ్లకు తగ్గుతుందని! ఓసారి తట్టుకోలేక తిరగబడ్డా. హేళన ఆగింది. నాలో ఆత్మవిశ్వాసమూ పెరిగింది. జుట్టు కూడా. ఉద్యోగంలో చేరాక నష్టాలొచ్చాయని తీసేశారు. ఆ ఒత్తిడికి అలోపేసియా తిరగబెట్టింది. 23 ఏళ్లుగా ఇదే పోరాటం. ఇక అలసిపోయా. శారీరకంగా ఏ ఇబ్బందీ లేనప్పుడు అందం పేరిట దీన్నెందుకు భరించాలనుకుని గుండు చేయించుకున్నా. ఇప్పుడు బెంగళూరులో పని చేస్తున్నా. ఇక్కడా నా వెనక హేళనలు, నవ్వులు! అందరికీ మెయిల్‌ పెట్టా. ‘నా గురించి తెలుసుకోవాలంటే నన్నే అడగండి, వెనక మాట్లాడొద్ద’ని. అప్పట్నుంచి ఇవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడూ చికిత్స తీసుకుంటున్నా.. కాకపోతే ఒత్తిడి తగ్గించుకోవడానికీ.. ప్రశాంతంగా ఉండటానికే.

- పరోమిత, బెంగళూరు.


పరిష్కారమేంటి?

అలోపేసియా అందరికీ ఒకేలా ఉండదు. దీని ప్రయాణాన్ని కచ్చితంగానూ చెప్పలేం. చల్లని వాతావరణంలో దీని ప్రభావమెక్కువ. కొందరికి వెంట్రుకలు ఊడినా తిరిగి వచ్చేస్తాయి. ఓసారి వచ్చాక మళ్లీ పోవు. కొత్త చోట ఊడినా మళ్లీ వస్తుంటాయి. ఇంకొందరిలో మాత్రం విపరీతం. మచ్చలు పడటమే కాక శాశ్వతంగా వెంట్రుకలు రాలిపోతాయి. ప్యాచ్‌ల సైజుల్లోనూ మార్పులుంటాయి. దీన్ని పూర్తిగా నివారించడం కష్టమే. కానీ ప్రభావాన్ని తగ్గించొచ్చు. కార్టికో స్టెరాయిడ్స్‌ను ప్యాచ్‌ల వద్ద ఇంజెక్షన్ల ద్వారా ఇస్తారు. దీంతో ఆ ప్రదేశంలో జుట్టు తిరిగి పెరుగుతుంది. వెంట్రుకలు విపరీతంగా రాలుతోంటే పైపూతగా లేదా మందు రూపంలో కార్టికో స్టెరాయిడ్స్‌ను వాడాలి. ప్యాచెస్‌ విస్తరిస్తోంటే మాత్రల్నీ, పైపూతగా మినాక్సిడల్‌ ద్రావణాన్నీ ఇస్తారు. టాపికల్‌ ఇమ్యునో థెరపీనీ సూచిస్తాం. కనీసం 12 వారాలు వాడితేనే ఫలితం కనిపిస్తుంది. దాంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోడానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్