Updated : 02/08/2022 08:47 IST

అలిగారని ఇచ్చేస్తున్నారా?

అదితి ఎనిమిదేళ్ల కూతురికి అడిగినదేదైనా కొనివ్వకపోతే ఏడ్చి, భోజనం మానేస్తుంది. దీంతో వెంటనే కొనిస్తుంది. పిల్లలు కోరారని క్షణాల్లో ఏర్పాటు చేసివ్వడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. కొనిచ్చేముందు కాస్త ఆలోచించాలని, లేదంటే భవిష్యత్తులో  ఇబ్బందులనెదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

పిల్లలు తమకు బొమ్మలు, తినుబండారాలు, దుస్తులు వంటివి కావాలని మారాం చేస్తుంటారు. స్నేహితుల వద్ద ఉండే ఆటవస్తువులను చూసి తమకూ అటువంటివి కొనివ్వాలని అడుగుతారు. కాదంటే ఏడవడం, అలగడం చేస్తుంటారు. అలా వారడిగే ప్రతిదాన్నీ వెంటనే తల్లిదండ్రులు అందించడం అలవాటు చేస్తే, ఆ పద్ధతినే పిల్లలు కొనసాగిస్తారు. తాము మారాం చేస్తుంటే కోరింది చేతికందుతుందనే ఆలోచన వారి మెదడులో నిక్షిప్తమవుతుంది. ఇది భవిష్యత్తులో వారికి సమస్యగా మారొచ్చు. అనుకున్న ప్రతి వస్తువూ చేతికి అందకపోవచ్చు. దాంతో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఏదైనా కావాలని చిన్నారులు అడిగినప్పుడు అది అవసరమైందా.. కాదా అని ముందుగా పెద్దవాళ్లు గుర్తించాలి. ఉపయోగపడుతుందంటే కొనివ్వడం మంచిది.

విన్న తర్వాతే.. చిన్నారులు ఏదైనా అడుగుతున్నప్పుడు పూర్తిగా వినాలి. ఆ తర్వాత కొంత సమయం తీసుకోవాలి. షాపింగ్‌కు వెళ్లినప్పుడు చూసిందల్లా కొనివ్వమని అడిగే పిల్లలుంటారు. అవన్నీ అత్యవసరం కాదనిపించినప్పుడు వద్దు అని కోపంగా చెప్పకుండా, దాన్నెందుకు ఇప్పించడంలేదో కారణం వివరించాలి. కొన్ని రోజుల తర్వాత కొనుక్కుందామని మృదువుగా చెప్పాలి. మొదట మారాం చేసినా.. ఆ తర్వాత పిల్లలు కూడా ఆలోచించడం మొదలుపెడతారు. తమ డిమాండ్‌  ఎంత వరకూ సమంజసమో తెలుసుకుంటారు. 

నొప్పించకుండానే.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితిపై అవగాహన లేకుండా మొండిగా తమకు కావాల్సిన వస్తువులను తెచ్చివ్వమని కొందరు చిన్నారులు చికాకు పెడుతుంటారు. వయసుకు మించి ల్యాప్‌టాప్‌ లేదా ఐఫోన్‌ వంటివి అడుగుతుంటారు. ఇటువంటప్పుడు పెద్దవాళ్లు కచ్చితంగా కుదరదని చెప్పగలగాలి. ఆ వస్తువు అవసరమైనప్పుడు కొనుక్కుందామనాలి. మరికొందరు పిల్లలు తమ స్నేహితుల వద్ద లేదా పొరుగింట్లో ఉన్న వస్తువులు తమ ఇంట్లోనూ ఉండాలని కోరతారు. ఇటువంటప్పుడు కూడా తల్లిదండ్రులు నో చెప్పాలి. ఇతరులను అనుసరించడం కాకుండా తమ అవసరాలు తీరేలా వస్తువులుండాలనే అంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్