Published : 28/06/2022 00:21 IST

వర్షాకాలంలో పచ్చని బాల్కనీ...

చినుకులు పడుతున్న వేళ బాల్కనీలో నిలబడి వెచ్చని టీ తాగుతుంటే... పాదాలకు మెత్తని పచ్చిక తగిలితే.. ప్రకృతి మన చెంతకు వచ్చినట్లే. ఇప్పటికిప్పుడు బాల్కనీలో పచ్చదనాన్ని నింపేదెలా అనుకోవద్దు. ఆర్టిఫిషియల్‌ గ్రాస్‌ సర్దేస్తే చాలు. వర్షాకాలంలో పచ్చని మెత్తదనం మన పాదాలకు తగులుతూ.. మనసంతా ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఆర్టిఫిషియల్‌ గ్రాస్‌ లభ్యమవుతోంది. దాన్ని బాల్కనీకి సరిపోయేలా ఎంపిక చేసుకుంటే చాలు. ముందుగా ఆ ప్రాంతాన్నంతటినీ ఖాళీచేసి గ్రాస్‌ సర్దాలి. ఆ తర్వాత బాల్కనీ మూలల్లో వరుసగా సహజసిద్ధమైన మొక్కలను అమర్చాలి. రెండు మూడు రోజులకొకసారి గడ్డిని బ్రష్‌ చేస్తుంటే దుమ్మూధూళీ లేకుండా శుభ్రంగా కనిపిస్తుంది. మైదానంలో ఉన్నట్లుగా అనిపించి మనసుకు హాయినందిస్తుంది.

నిల్వ లేకుండా..
వర్షం కురిసి వెలిసిన తర్వాత ఈ గ్రాస్‌లో నిల్వ ఉన్న నీటిని వెంటనే క్లీన్‌ చేయాలి. బాల్కనీ మూలల్లో ముందుగానే రంధ్రాలు ఏర్పాటు చేసుకుంటే, వర్షపు నీరు బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఈ ఆర్టిఫిషియల్‌ లాన్‌ను వర్షం కురిసిన ప్రతిసారీ బ్రషింగ్‌ చేయడం మరవకూడదు. అప్పుడే వాటి మధ్య ఇరుక్కున్న మురికి, వ్యర్థాలు నీటిద్వారా బయటికి పోయి, మెరుస్తూ చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది.  

పిల్లలతో..
సాయంత్రం వేళల్లో ఈ పచ్చగడ్డిలో పిల్లలతో కలిపి సంతోషంగా ఆడుతూ గడపొచ్చు. శుభ్రం చేసిన తర్వాత ఇందులో జారిపోయే ప్రమాదం ఉండదు. చిన్నారులు ఆటల్లో పడిపోయినా దెబ్బలు తగిలే అవకాశం లేదు. చిన్న టేబుల్‌, కుర్చీలు సర్దితే ఖాళీ సమయాల్లో వెచ్చని టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఒత్తిడిని దూరం చేసే ఈ అనుభవం మనసును దూదిపింజలా మార్చేస్తుంది. ఇక్కడ చిన్న ఊయలను ఏర్పాటు చేసుకుంటే చాలు. వర్క్‌ బ్రేక్‌లో ఇందులో గడిపే ప్రతి క్షణం ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను అందిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్