Updated : 06/09/2022 06:49 IST

నిద్రపోయింది.. రూ.5లక్షలు అందుకుంది...

‘గంటలతరబడి అలా నిద్రపోతూ.. ఉంటే లక్ష్యమెలా సాధిస్తావు’.. ‘అలా నిద్రపోతే రూపాయి కూడా సంపాదించలేవు’.. ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం హాయిగా నిద్రపోయి మరీ రూ.5 లక్షల నగదు బహుమతిని కొట్టేసింది. మీరు విన్నది నిజమే! ఎలా అంటే...

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యంపైన  అవగాహన కలిగించడానికి ‘వేక్‌ ఫిట్‌’ సంస్థ ఓ వినూత్నమైన పోటీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎవరైతే వరుసగా 100 రోజులు  రాత్రిపూట 9 గంటలు గాఢంగా నిద్రపోతారో వారినే విజేతగా నిర్ణయించి నగదు బహుమతి అందిస్తుంది. అలా సీజన్‌-2(2021) పోటీలో దేశవ్యాప్తంగా 5.5లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారట. వీరిలో తుది జాబితాలో మిగిలిన 15మందిలో చివరివరకు నిలిచి నిద్రలో తన సత్తా చాటింది కోల్‌కతాకు చెందిన 26 ఏళ్ల త్రిపర్ణ. ‘స్లీప్‌ ఛాంపియన్‌’గా ఈమె రూ.5లక్షలు గెలుచుకోగా మిగతా 14 మందికీ తలా లక్షరూపాయలు బహూకరించారు. 

ఏంటీ పోటీ..

వేక్‌ఫిట్‌ సంస్థ పోటీదారులకు మెత్తని పరుపుతోపాటు నిద్రపై అవగాహన కలిగించేలా కౌన్సెలింగ్‌ సెక్షన్స్‌ నిర్వహణ, పోషకాహారనిపుణులతో సలహాలు కూడా ఇప్పిస్తారట. అంతేకాదండోయ్‌.. నిద్రపోయేటప్పుడు అభ్యర్థులు అత్యాధునిక స్లీప్‌ ట్రాకర్‌ను ధరించాలట. దీనిద్వారానే పోటీదారులెంత గాఢంగా నిద్రపోతున్నారో గుర్తిస్తారు. పోటీ బాగుంది కదూ... ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ పోటీ ఉద్ధేశం అంటున్నారు నిర్వాహకులు. మొదటి సీజన్‌కు రెండు లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో మూడో సీజన్‌కు పోటీ ప్రకటించిన నిర్వాహకులు ఈసారి బహుమతిని రూ.10 లక్షలు చేశారట. ఇంకెందుకాలస్యం.. ఆసక్తి ఉంటే కంటినిండా నిద్రపోయి లక్షల రూపాయల బహుమతిని తెచ్చేసుకోండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి