కార్పొరేట్‌ సంస్థలకే ఊతమిస్తుంది..

ఏ ఉత్పత్తైనా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే దాన్ని గురించి అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, సృజనాత్మకంగా అతి తక్కువ పదాల్లో చెప్పాలి. చాలా క్లిష్టమైన ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ వెయ్యికి పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది గుంజన్‌పాయ్‌. సాధారణ కాపీరైటర్‌గా ఈ రంగంలో కాలుమోపి అసాధారణ స్థాయికి ఎదిగిన ఆవిడ విజయ గాథ ఇదీ...

Updated : 24 Oct 2022 07:54 IST

ఏ ఉత్పత్తైనా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే దాన్ని గురించి అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, సృజనాత్మకంగా అతి తక్కువ పదాల్లో చెప్పాలి. చాలా క్లిష్టమైన ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ వెయ్యికి పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది గుంజన్‌పాయ్‌. సాధారణ కాపీరైటర్‌గా ఈ రంగంలో కాలుమోపి అసాధారణ స్థాయికి ఎదిగిన ఆవిడ విజయ గాథ ఇదీ...

కోల్‌కతాలో డిగ్రీ, పుణెలో మాస్‌ కమ్యూనికేషన్‌ చేసిన తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో చేరింది గుంజన్‌. వాళ్లది ముంబయ్‌. అక్కడ బ్రాండ్‌ వెబ్‌సైట్స్‌, మల్టీమీడియా కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ ప్రచారం వంటి బాధ్యతలు నిర్వర్తించేది.

ఆత్మవిశ్వాసాన్ని నింపాయి..

‘ఫ్రీలాన్స్‌ కాపీరైటర్‌గా క్రియేటివ్‌ స్ట్రాటజిస్ట్‌గా, కాపీరైటర్‌గా చాలా బ్రాండ్స్‌, యాడ్‌ ఏజన్సీలతో పని చేశా. క్రమేపీ ఒగిల్వీ అండ్‌ మాథర్‌, యూనీ లివర్‌, ఆదిత్యబిర్లా గ్రూపు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎమ్‌అండ్‌సీ సాచీ వంటి పెద్ద సంస్థలకు కంటెంట్‌ ఇచ్చే స్థాయికి ఎదిగా. ఈ అనుభవాలన్నీ ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. అప్పుడే సొంత సంస్థ ఆలోచన వచ్చింది. అలా 2015లో ‘కాపీ లవ్‌’ ప్రారంభించా. మా కుటుంబంలో తొలి మహిళా వ్యాపారవేత్తను నేనే. నా ఆలోచనకు కుటుంబ సభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. ప్రసవానంతరం నెలలోపే ఆఫీస్‌ బాధ్యతలను చేపట్టినప్పుడు మావారు ప్రోత్సహించి సాయపడే వారు. వారి చేయూతతోనే ఈ స్థాయికి చేరా’ అని చెబుతుంది గుంజన్‌.


అందరూ మహిళలే..

రంగంలో సృజనాత్మకతకే విజయం అంటుందీమె. ‘ఈ సంస్థను ప్రారంభించినప్పుడు నాకు లెక్కలు కొంచెం కూడా రావు. సొంత వ్యాపారమంటే ప్రతి అంశాన్నీ తెలుసుకోవాలని అర్థమైంది. అక్కౌంట్స్‌ నేర్చుకోవడానికి ప్రయత్నించా. మొదట్లో కష్టమైనా పట్టుదలతో సాధించా. సంస్థ బ్యాలెన్స్‌ షీట్‌ను నేనే పూర్తి చేయగలుగుతున్నా. బృందంతో కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలుంటాయి. ఆలోచనలను పంచుకోవడం, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం వంటివీ నైపుణ్యాలే. మావద్దకు వచ్చే సంస్థలు వాటి గురించి సమగ్ర సమాచారాన్ని ప్రజల్లోకి తేలికగా తీసుకెళ్లగలిగేలా మా కాపీ రైటింగ్స్‌ ఉండాలి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నా, మా ఆఫీస్‌లో 50మందికిపైగా సిబ్బంది అంతా మహిళలే’ అంటున్న గుంజన్‌ దేశవిదేశాలకు చెందిన 1,000కు పైగా కార్పొరేట్‌ సంస్థలు, యాడ్‌ ఏజన్సీలు, స్టార్టప్‌లు, వెబ్‌సైట్స్‌కు బ్రాండ్‌ కన్సల్టింగ్‌, రైటింగ్‌, బ్రాండ్‌ డిజైన్‌, కాపీ రైటింగ్‌ వంటి వాటిలో సేవలు అందిస్తోంది గుంజన్‌. అంతేకాదు... ఈ కెరియర్‌లో కొత్త తరాలను ప్రోత్సహించడానికి టెడెక్స్‌ వంటి వేదికలపై ప్రసంగిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని