Updated : 18/10/2022 05:22 IST

సాయం కోరడంలో వెనకాడొద్దు!

అనుభవ పాఠాలు

పిల్లలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని వ్యాపారవేత్తనయ్యా. ఉద్యోగినిగా ఉన్నప్పుడు పని వేళలు, కుటుంబానికి కేటాయించాల్సిన సమయం పట్ల స్పష్టత ఉండేది. వ్యాపారంలోకి అడుగుపెట్టాక నిలదొక్కుకోవాలంటే ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకోక తప్పని పరిస్థితి. నేనో అమ్మని. కెరియర్‌తోపాటు పిల్లల ఆలనాపాలనా ముఖ్యమే. ఒకదాని కోసం మరోటి వదిలేయలేను. ప్రారంభంలో రెండింటి మధ్యా సమన్వయం తేలేక ఇబ్బందిపడ్డా. అప్పుడు నాకు తోచిన మంత్రం ‘సాయం కోరడం’. మన ఆడవాళ్లం, ఎవరినీ ఇబ్బందిపెట్టొద్దు, అన్నీ మనమే చూసుకోవాలన్న ధోరణిలో ఉంటాం. అదే మనం చేయగలమా అన్న సందేహాన్ని రేకెత్తిస్తుంది. చివరికి ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలన్న పరిస్థితిని తెస్తుంది. కాబట్టి, జీవిత భాగస్వామి, పెట్టుబడిదారు ఎవరైనా సరే.. అవసరమైనప్పుడు సాయమడగడంలో సందేహపడొద్దు. ఆఫీసు వేళలు, పిల్లల అవసరాలను బట్టి నా సమయాన్ని పక్కాగా నిర్ణయించుకుంటా. పిల్లల స్కూలు విషయాలు, ఆఫీసు అత్యవసర మీటింగ్‌.. ఏదైనా రెంటికీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటా. ఏ సమయాల్లో అందుబాటులో ఉంటానన్న స్పష్టత ఇంట్లో వాళ్లకీ, ఆఫీసు వాళ్లకీ ఉండటంతో రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బందుండదు. తోటి ఆడవాళ్లకీ ఇదే చెబుతా. ప్రాధామ్యాలను నిర్ణయించుకొని ముందుకుసాగండి. అవసరమైతే సాయమడగడానికి మొహమాటపడొద్దు అని!

- మల్లిక సదానీ, సీఈఓ, మామ్స్‌ కో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి